హనుమకొండ: హనుమకొండ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి (DTC) పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ దాడులు (ACB Raids) నిర్వహిస్తున్నది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు జగిత్యాలలోని ఆయన బంధువుల ఇండ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు.
ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ గతేడాది ఫిబ్రవరిలో బదిలీపై వరంగల్ జిల్లాకు వచ్చారు. అయితే ఆయన వ్యవహారశైలిపై అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి.