సుల్తానాబాద్, జూన్ 28: మున్సిపల్ శాఖకు చెందిన అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. కొత్త ఇంటికి నంబర్ ఇచ్చేందుకు రూ.10వేలు డిమాండ్ చేసి, రూ.5వేలు తీసుకుంటూ శనివారం దొరికిపోయాయి. సుల్తానాబాద్ బల్దియాలోని బిల్ కలెక్టర్ విజయ్, ఆర్ఐ వినోద్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఏస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్‌లోని ద్వారకానగర్‌కు చెందిన ప్రసాద్ ఇంటిని నిర్మించుకున్నాడు.
ఇంటి నంబర్ కోసం మున్సిపల్ బిల్‌కలెక్టర్ విజయ్, ఆర్ఐ వినోద్‌కుమార్‌కు దరఖాస్తు చేయగా వారు రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు. శనివారం పూసాల రోడ్డులో బాధితుడి నుంచి విజయ్ రూ.5వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి ఆర్ఐ వినోద్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.