హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వాధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్ కోరారు.
మంగళవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో ఏసీబీ డైరెక్టర్ వీఆర్ శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ‘లంచం ఇవ్వకండి.. మాకు సమాచారం ఇవ్వండి’ అనే పోస్టర్‌ను సీవీ ఆనంద్ ఆవిష్కరించారు. ఇందుకు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఏ సమయంలోనైనా కాల్, dg_ acb@ telangana. gov.inకి మెయిల్ చేయాలని సూచించారు.