వినాయక్‌నగర్, జనవరి 29: నిజామాబాద్ మండంలం బోర్గాం(పీ) వద్ద ఉన్న కార్ బజార్ నిర్వాహకుడు స్వామి చిరంజీవి అనే వ్యక్తికి కారును విక్రయించాడు. చిరంజీవి లోన్ డబ్బులు చెల్లించకపోవడంతో మొదటి యజమాని రాజేశ్‌కు నోటీసులు వచ్చాయి. దీంతో అతడు లింగంపేట ఎస్సై సుధాకర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు ఎస్సై కార్బజార్ నిర్వాహకుడికి ఫోన్ చేసి కేసు నమోదుకాకుండా ఉండడానికి 30 వేలు లంచం డిమాం డ్ చేశారు. దీంతో అతడు 12,500 ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకొని, ఏసీబీని ఆశ్రయించారు. స్వామి ఎస్సైకి 12,500 ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.