న్యూస్‌నెట్‌వర్క్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థు లు మృతి చెందడాన్ని నిరసిస్తూ గురువారం జిల్లా ల్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. జనగామ, భూపాలపల్లితోపాటు చిట్యాల, మహదేవపూర్‌లో ఏబీవీపీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మృతి చెందిన విద్యార్థుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తాకుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజ న్, వివిధ కారణాలతో మరణిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. కాగా మ హబూబాబాద్ జిల్లా కురవిలో జాతీయ రహదారిపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా కో కన్వీనర్ జ్యోతి బసు, మండల అధ్యక్షుడు వీరేందర్ మాట్లాడుతూ.. గురుకులాల్లో చనిపోయిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రి లేకపోవడంపై వారు మండిపడ్డారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో అధ్వానంగా ఉన్న మధ్యాహ్న భోజనం, విద్యార్థిని శైలజ మరణం, మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో వందలాది విద్యార్థులు ఖాళీ ప్లేట్లతో ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున నినదించారు.
గురుకుల హాస్టళ్లలో మరణించిన 51 మంది విద్యార్థులకు సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్‌కుమార్ మాట్లాడుతూ.. గురుకుల హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు, వారి సమస్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్,నవంబర్ 28 (నమస్తేతెలంగాణ): తెలంగాణ విద్యాకమిషన్ రాష్ట్రంలో విస్త్ర త పర్యటనలకు శ్రీకారం చుట్టింది. చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్, వెంకటేశ్, జ్యోత్స్న నవంబర్ 28 నుంచి డిసెంబరు 7 వరకు జిల్లాలలోని వి ద్యాసంస్థలను సందర్శిస్తారు. అక్కడ విద్యాప్రమాణాలు, కల్పిస్తున్న సౌకర్యాలు, బోధనాతీరు ను పరిశీలిస్తారు. విద్యాకమిషన్ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. విద్యాకమిషన్ తొలిరోజైన గురువారం వికారాబాద్ జిల్లాలో పర్యటించింది.