హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని జిల్లా, నగర గ్రంథాలయ సంస్థల చైర్మన్లు నాన్ ఆఫీషియల్ మెంబర్ల పదవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శుక్రవారం జీవో జారీచేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు జిల్లా గ్రంథాలయ సంస్థలున్నాయి. వీటికి నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లతో పాటు, సభ్యులను గత ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం రావడంతో వీరి పదవులు రద్దు చేస్తూ, ఉత్తర్వులిచ్చారు.