హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): డైట్ కాలేజీల్లోని కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (సీపీడీ) సెంటర్లలో పనిచేస్తున్న టీచర్ల డిప్యూటేషన్లను విద్యాశాఖ రద్దుచేసింది. ఈ మేరకు జిల్లాలవారీగా డీఈవోలు ఆయా డిప్యూటేషన్లను రద్దుచేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో విద్యాశాఖ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయ వృత్తి వికాసానికి ఈ సెంటర్లలో సబ్జెక్టు నిపుణులను నియమించింది. ఇందుకోసం 10 డైట్ కాలేజీల్లో 106 మం ది విషయ నిపుణుల (రీసోర్స్ పర్సన్స్)ను నియమించారు. తాజాగా డిప్యూటేషన్ల రద్దు నిర్ణయంతో ఆయా టీచర్లంతా తమ పాత స్థానాలకు బదిలీ అయ్యారు. ఇప్పటికే ఎస్సీఈఆర్టీల్లో డిప్యూటేషన్, ఫారిన్ సర్వీసెస్, ఆన్డ్యూటీలను రద్దుచేశారు.