హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఉన్న తాత్కలిక పోలీస్ అధికారుల సంఘాన్ని రద్దు చేసి, కొత్త సంఘం కోసం ఎన్నికలు నిర్వహించాలని డీజీపీ రవిగుప్తా, ఐజీపీ పర్సనల్‌కు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మాజీ కోశాధికారి జీఎస్ రాజు తదితరులు విన్నవించారు. శనివారం డీజీపీ కార్యాయలంలో రవిగుప్తాకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రస్తుత, మాజీ సభ్యులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సంఘాన్ని రద్దు చేస్తామని, త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్టు చెప్పారు.
ఇక నుంచి సిబ్బందికి సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తనను కలవొచ్చిన డీజీపీ చెప్పినట్టు వారు తెలిపారు. ఇకనుంచి పోలీసుల సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేకంగా దర్బార్‌ను నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు డీజీపీ చెప్పారని పేర్కొన్నారు. డీజీపీని కలిసిన వారిలో బెటాలియన్ల తరఫున జంగయ్య, సంగారెడ్డి నుంచి జనార్దన్, సుభాష్, హైదరాబాద్ నుంచి అప్పలసూరి, నరేందర్, ఖమ్మం నుంచి చంద్రశేఖర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్‌గౌడ్, సైబరాబాద్ నుంచి మల్లేశ్ తదితరులు ఉన్నారు.