హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి గురువారం పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు, రాష్ర్టానికి రావాల్సిన నిధులు, హక్కుల గురించి వాణి వినిపిస్తానని చెప్పారు. నరేందర్‌రెడ్డికి మంత్రులు సీతక్క, శ్రీహరి అభినందనలు తెలిపారు.