హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) చైర్‌పర్సన్‌గా అభిజాత్ చంద్రకాంత్ షెత్ను కేంద్ర క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ నియమించింది. ఈ నియామకం నాలుగేండ్లపాటు కొనసాగుతుందని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం అభిజాత్ చంద్రకాంత్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇదే ఉత్తర్వుల్లో మెడికల్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డు (మార్బ్)ప్రెసిడెంట్‌గా ఎంకే రమేశ్‌ను కమిటీ నియమించింది.