HCU | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల్లో అటవీ నిర్మూలనను ఆపాలని, జీవవైవిధ్యాన్ని కాపాడాలని శివసేన(యూబీటీ)నేతఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం జీవవైవిధ్యం విలువను గుర్తిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అలాగే ప్రముఖ రచయిత తుషార్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్‌రెడ్డిని మందలించకపోతే వారు తమ హైకమాండ్ హోదా గురించి పునరాలోచించుకోవాలని చెప్పారు.