హైదరాబాద్, సెప్టెంబర్3 (నమస్తే తెలంగాణ): ఓటర్ గుర్తింపు కార్డులతో ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియ తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్నది. గత నెల 1న ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటినుంచి నెల రోజుల వ్యవధిలో 51 లక్షల మంది తమ ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌ను అనుసంధానించుకున్నారు.
ప్రత్యేకంగా రూపొందిం చిన సాఫ్ట్వేర్ సాయంతో అధికారులు 10,25,987 డబుల్ ఎంట్రీలను తొలగించారు. మిగిలిన 2.93 కోట్ల మంది ఓటర్లలో 51 లక్షల మంది తమ గుర్తింపుకార్డులను ఆధార్‌తో అనుసంధానించుకోవడంతో ఇంకా 2.42 కోట్ల మంది మిగిలారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన వెంటనే వీరి కార్డులను కూడా ఆధార్‌తో అనుసంధానించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు.