Reels | నర్సంపేట, జూన్ 20: రీల్స్ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఉరేసుకునే వీడియో తీయబోయి ప్రమాదవశాత్తు ఉరి బిగుసుకోవడంతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. నర్సంపేటకు చెందిన కందికట్ల అజయ్(23) హోటల్లో పనిచేస్తున్నాడు. అతడికి రీల్స్ చేసే అలవాటు ఉన్నది.
మంగళవారం మల్లంపల్లి రోడ్డులో ఉన్న అతడి చిన్నక్క ఇంటికి వచ్చా డు. రాత్రి గదిలోకి వెళ్లి ఉరివేసుకునే రీల్ చేయాలని అనుకుని ఇంట్లోని దూలానికి ఉరి పెట్టుకున్నాడు. ఫ్రిడ్జ్పై సెల్ఫోన్ అమర్చి దానిని చిత్రీకరించే క్రమంలో మెడకు ఉన్న తాడు బిగుసుకొని మృతి చెందాడు. బుధవారం కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.