ములుగు : మందు పాతర పేలిన(Landmine blast) ఘటనలో గాయపడి ఓ మహిళ తన కాలును పోగొట్టుకుంది. ఈ విషాదకర సంఘటన ములుగు(Mulugu) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామానికి చెందిన డర్రా సునీత ఫ్రెషర్ బాంబు పేలిన ఘటనలో కాలు చిధ్రమైంది(Woman injured).
ఈ మేరకు గురువారం రాత్రి వెంకటాపురంలో ప్రాథమిక చికిత్స అనంతరం, భద్రాచలం కార్పొరేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స నిర్వహించి, బాంబు పేలుడులో ఛిద్రమై కాలును డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించి తొలగించారు. కాగా, తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు అమర్చిన ఫ్రెషర్ బాంబు పేలి మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన తెలిసిందే.