నెల్లికుదురు, నవంబర్ 14: ‘సారూ.. మాకు రుణమాఫీ ఎప్పుడైతది’ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ను ఓ మహిళా రైతు ప్రశ్నించింది. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో చోటుచేసుకుంది. గ్రామంలో నెల్లికుదురు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మురళీనాయక్ ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడి వెళ్తుండగా గ్రామానికి చెందిన ఆలకుంట్ల దర్గమ్మ ఎమ్మెల్యే వద్దకు వచ్చి ‘సారూ.. మాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు.. ఇంకెప్పుడు అయితది’ అని ప్రశ్నించింది. స్పందించిన ఎమ్మె ల్యే డిసెంబర్ 31 వరకు ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందమ్మా అని జవాబిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.