Hanmakonda | హనుమకొండ : హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం సృష్టించాయి. కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్.. మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెను తన క్యాబిన్లోకి పిలిపించుకుని, తాకరాని చోట తాకుతూ.. పైశాచిక ఆనందం పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో బాధితురాలు సీనియర్ అసిస్టెంట్‌పై కలెక్టర్ స్నేహ శబరీష్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు అధికారిని బదిలీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.