గిర్మాజీపేట, మార్చి 5: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళా కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. నగరంలోని 25వ డివిజన్ వేణురావు కాలనీకి చెంది న ఎదులాపురం మౌనిక (28) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలంగా భర్త శ్రీధర్ వేధింపులు తాళలేక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువులు అనుమానాస్పద మృతిగా మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.