సూర్యాపేటటౌన్, జూలై 22: పద్మశాలి కులసంఘం ఎన్నికలపై వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఒక వ్యక్తి దారుణహత్యకు దారితీసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన మానుపురి కృపాకర్ (48) చెప్పుల వ్యాపారంచేసేవారు. వచ్చే నెల 3న నిర్వహించనున్న పద్మశాలీ కుల సం ఘం ఎన్నికలకు సంబంధించి ఆ సం ఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్ కులసంఘానికి సంబంధించిన వాట్సాప్ గ్రూ ప్లో ఓ మెసేజ్ పెట్టారు.
దానికి కృపాకర్ క్లాప్స్ కొడుతూ ఎమోజీ పెట్టారు. దీన్ని జీర్జించుకోలేని అదే కులానికి చెందిన మరోవర్గం నాయకుడు శ్రీరాముల రాములు అలా ఎందుకు స్పం దించావంటూ సోమవారం రాత్రి కృపాకర్కు ఫోన్ చేసి బెదిరించారు. ఈ విషయంపై కుల పెద్దలకు కృపాకర్ ఫోన్లో ఫిర్యాదు చేసి, మంగళవా రం సంఘభవనానికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న శ్రీరాముల రాము లు, అతడి కుమారుడు ధనుంజయ్తోపాటు మరో నలుగురు వ్యక్తులు కృపాకర్పై పిడిగుద్దులతో దాడిచేశారు.
అనంతరం తీవ్రంగా గాయపడిన కృపాకర్ను సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య విజయలక్ష్మి, కుమార్తె అమూ ల్య, కుమారుడు అజయ్ ఉన్నారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటయ్య తెలిపారు.