కొల్చారం, అక్టోబర్ 11: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ గిరిజన మహిళను వివస్త్రను చేసి.. చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన ఏడుపాయలకు వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం జానకంపల్లి పంచాయతీ పరిధిలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి మెదక్‌లోని అడ్డా కూలికి వెళ్లింది.
అక్కడ దుండగులు ఆమెను ఏడుపాయల వైపు తీసుకెళ్లారు. అప్పాజిపల్లి శివారులో ఓ ప్లాట్ వెనుక మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో దుండగులు పారిపోయారు. శనివారం ఉదయం అటుగా వెళ్లిన కొందరు వ్యక్తులు చెట్టుకు కట్టేసి ఉన్న మహిళను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
నర్సాపూర్ డీఎస్పీ ప్రసన్నకుమార్, కొల్చారం, పాపన్నపేట ఎస్సైలు మొయినొద్దీన్, శ్రీనివాస్‌గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని పోలీసు వాహనంలో మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొల్చారం ఎస్సై తెలిపారు.