Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ గర్భిణి మృతి చెందింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పేపర్-1 పరీక్ష రాసేందుకు రాధిక(గర్భిణి) వచ్చింది. పరీక్షకు వెళ్లే తొందరలో వేగంగా పరీక్ష గదికి ఆమె చేరుకుంది.
దీంతో ఆమెకు బీపీ ఎక్కువై పరీక్ష గదిలోనే పడిపోయింది. అక్కడే ఉన్న భర్త అరుణ్ ఆమెను హుటాహుటిన పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో అరుణ్ భార్య మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించాడు.