హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీ శివానందప్రసాద్ ఇతర సీనియర్ ప్రభుత్వ ప్లీడర్ల బృందం శనివారం డీజీపీ అంజనీకుమార్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై వారు విస్తృతంగా చర్చించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, దానికి అనుగుణంగా సిబ్బందికి అవగాహన కల్పించడంపై చర్చించారు. ప్రతి త్రైమాసికంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని వారు నిర్ణయించారు. కార్యక్రమంలో హోంశాఖ సెక్రటరీ డాక్టర్ జితేందర్, ఏడీజీ లీగల్ కే శ్రీనివాస్‌రెడ్డి, ఏడీజీ డాక్టర్ సౌమ్యామిశ్రా, ఐజీపీ పర్సనల్ వీబీ కమలాసన్‌రెడ్డి, జాయింట్ సీపీ వీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.