హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పులపై మానవ ప్రభావం కచ్చితంగా ఉన్నదని హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దేశంలో ప్రతీ ఏటా చలిగాలు లు తగ్గుముఖం పడుతుండగా.. వేడి గాలులు మాత్రం పెరుగుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇలాంటి వాతావరణ పరిస్థితులతో మానవ ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని గుర్తించారు.
పరిశోధకులు 1970 నుంచి 2019 వరకు నమోదైన ఉష్ణోగ్రతల ఆధారంగా అధ్యయనం చేపట్టారు. రోజువారీ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రత డాటాను పరిశీలించా రు. మానవ సంబంధ, వాతావరణ మార్పుల కారణంగానే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత సుమా రు 1 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని గుర్తించారు. దీంతో భూమిపై వేడి, శీతల తరంగాల్లో మార్పులు సంభవిస్తున్నట్టు తేల్చారు. ఈ అధ్యయన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్’లో ప్రచురితమయ్యాయి.