సుబేదారి, నవంబర్ 30 : విద్యార్థినిపై హాస్టల్ నిర్వాహకురాలి బంధువు లైంగిక దాడి చేయగా బుధవారం కేసు నమోదైంది. హనుమకొండ పోలీసుల కథనం ప్రకా రం.. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఉన్నత విద్య అభ్యసిస్తున్నది. హాస్టల్లో ఉన్న సమయంలో ఫోన్ మాట్లా డుతుండగా హాస్టల్ నిర్వాహకురాలు గమనించింది. ‘నేను చెప్పినట్టు వినకుంటే మీ తల్లిదండ్రులకు చెప్తా’నని బెదిరించింది. తన దగ్గరి బంధువుతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడిచేసింది. కొద్దిరోజులుగా మెడికల్ షాపు నిర్వాహకుడు ఆ విద్యార్థినిని తన ఇంటికి పిలిపించుకొని లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇదిలావుండగా మరో వ్యక్తి దగ్గరికి కూడా వెళ్లాలని, లేకపోతే తన బంధువుతో కలిసిన విషయాన్ని హాస్టల్లో ఉంటున్న వారందరికీ చెప్తానని హాస్టల్ నిర్వాహకురాలు ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేసింది. ఆ విద్యార్థిని రెండురోజుల క్రితం పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేసింది. విచారణ చేపట్టిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన మెడికల్ షాపు నిర్వాహకుడు వేముల విజయ్‌కుమార్, హాస్టల్ నిర్వాహకురాలు వేముల శోభపై కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.