అనంతగిరి, డిసెంబరు 1: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ లో ఆదివారం ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థులు, బంధువులు తెలిపిన వివరాలు.. చింతలపాలెం మండలం నక్కగూడేనికి చెందిన గుగులోతు తిరుమలేశ్ (15) శాంతినగర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ స్థానిక సమీకృత హాస్టల్లో ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన బత్తిని వీరబాబు హాస్టల్లో పాఠాలు బోధించేవాడు. ఆదివారం వీరబాబు తన పొలానికి వెళ్తూ తిరుమలేశ్, తరుణ్‌ను తీసుకెళ్లాడు. పనుల అనంతరం ఈత కొట్టేందుకు వీరబాబు బావిలోకి దిగగా తిరుమలేశ్ అతన్ని అనుసరించి బావిలోకి దూకాడు. గమనించిన తరుణ్ గ్రామస్తులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని కోదాడ దవాఖానకు తరలించారు.