హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేంద్ర పథకాల అమలు, నిధులు విడుదల వంటి అంశాల పర్యవేక్షణ కోసం సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ)ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం రెండు వేర్వేరు జీవోలను విడుదల చేశారు. ఎస్ఎన్ఏ తరహాలో ‘అకౌంట్స్ రెండింగ్ యూనిట్’ (ఏఆర్యూ) ఏర్పాటుకు మార్గదర్శకాలను జారీ చేశారు. డిప్యుటేషన్ పద్ధతిలో 9 మంది ఉద్యోగులను నియమించుకుని ఎస్ఎన్ఏ-స్పార్స్ విధానంలో వెంటనే ‘అకౌంట్ రెండింగ్ యూనిట్’ను ఏర్పాటు చేయాలని ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్‌ను ఆదేశించారు.