దుండిగల్, అక్టోబర్15: సూరారం పో లీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 12న అదృశ్య మైన ఓ బాలిక దారుణహత్యకు గురైంది. స్థానికులు, మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తె లిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ జి ల్లా అంకోలాకు చెందిన దంపతులు ప్రభాకర్, సుమ బతురుదెరువు కోసం ఏడు నెలల కిందట సూరారంకు వచ్చారు. జీవనజ్యోతినగర్లో నివాసముంటున్నారు.
వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 12న ఇంటి ఎదుట ఆడుకుంటున్న పెద్దకూతురు(7) ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఈ విషయమై పాప తల్లిదండ్రు లు సూరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసరగడి గ్రామంలోని నిర్జన ప్రదేశంలో గోనె సంచి లో బాలిక మృతదేహం ఉందంటూ పోలీసులకు సమాచారం అందింది.
అక్కడికి చే రుకున్న పోలీసులు సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 12న అదృశ్యమైన బాలికదిగా అనుమానించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని తమ బిడ్డ మృతదేహమేనని నిర్ధారించారు. నిందితుడు తిరుపతి(30)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలిక తల్లిపై కన్నేసిన తిరుపతి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు విచారణలో తేలినట్టు పో లీసులు పేర్కొన్నారు. ఇద్దరు కూతుళ్లతో పా టు భర్తను కూడా హతమార్చితే ఆమె తన వద్దకు వస్తుందని తిరుపతి పథకంగా పేర్కొన్నారు. అపహరించిన రోజే బాసరగడికి తీ సుకెళ్లి పదునైన కత్తితో గొంతుకోసి,కడుపులో పొడిచి హత్య చేసినట్టు పేర్కొన్నారు.