హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ హైదరాబాద్‌లో ప్రధాని మోదీపై సెటైరికల్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ‘గ్యాస్ ధర పెరిగినట్లుగానే మోదీ ఇమేజ్ గ్రాఫ్ కూడా రోజు రోజుకూ పెరుగుతున్నది’ అంటూ ఎద్దేవా చేశారు. బైబై మోదీ హ్యాష్ ట్యాగ్‌తో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వీడ్కోలు పలుకుతూ ఈ బ్యానర్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ బ్యానర్ ప్రయాణికులను విశేషంగా ఆకర్షించడంతో పాటు ధరల పెంపుపై కేంద్రం తీరుపై ఆలోచన చేసేలా చేస్తున్నది.