ప్రారంభానికి సిద్ధమైన ‘విప్రహిత’
విప్రహిత బ్రాహ్మణ సదనం పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, గోపన్‌పల్లి గ్రామంలో నిర్మిస్తున్న విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభానికి సిద్ధమైంది.
- రూ. 10 కోట్లతో బ్రాహ్మణ సదనం
హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): విప్రహిత బ్రాహ్మణ సదనం పథకం కింద తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభానికి సిద్ధమైంది. 6.10 గుంటల స్థలంలో రూ.10 కోట్లతో దీన్ని నిర్మించారు. ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 12 నిర్మాణాలను చేశారు. మూడంతస్తుల ఆడిటోరియం(ఫంక్షన్ హాలు), సమాచార కేంద్రం, మఠాధిపతులు, పీఠాధిపతుల విడిది సదనం మొదలైనవి ఇందులో ప్రధానమైనవి. రూ.10 కోట్ల అంచనాతో నిర్మాణం చేపట్టగా, ఇప్పటివరకు రూ.9.43 కోట్లు దీనికోసం ఖర్చు చేశారు.
కులమతాలకు తావులేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేదరికంలో ఉంటూ నిరాదరణకు గురైన బ్రాహ్మణ సమాజాన్ని ఉద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ ఏర్పడిన అనంతరం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటుచేసి వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.100 కోట్లు కేటాయించింది. అవసరాలకు అనుగుణంగా ఏటా ప్రభుత్వం బడ్జెట్లో కూడా నిధులను కేటాయిస్తున్నది. ఈ క్రమంలోనే బ్రాహ్మణ సమాజం విస్తృత ప్రయోజనాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి గోపన్‌పల్లిలో భూమిని కేటాయించడంతోపాటు నిధులు మంజూరు చేశారు. 2017 జూన్ 5న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కే తారక రామారావు చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం ఈ సదనం నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
విప్రహిత బ్రాహ్మణ సదనం పథకం
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సమాజం కోసం విప్రహిత బ్రాహ్మణ సదనం పథకాన్ని అమలు చేస్తున్నది. సాంస్కృతిక, సంప్రదాయక, సామాజిక, వైదిక పరమైన, బ్రాహ్మణ సమాజ హిత కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఉద్దేశించిన ఈ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 75 శాతం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ భరిస్తుంది. మిగిలింది దాతలు, లేక స్థానిక బ్రాహ్మణ సమాజం ద్వారా సమకూర్చుకుంటారు.
మరికొన్ని చోట్ల బ్రాహ్మణ సదనాలు….
- సూర్యాపేట జిల్లాలో బ్రాహ్మణ సదనం నిర్మాణానికి స్థానిక నివాసి డాక్టర్ ఏ రామయ్య ఒక ఎకరం స్థలాన్ని స్వచ్ఛందంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌కు ఇవ్వగా అక్కడ బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.రెండు కోట్లు కేటాయించింది. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు 75 శాతం పూర్తయ్యాయి.
- సిద్దిపేటలోని బ్రాహ్మణ పరిషత్తు భవన నవీనీకరణ కోసం ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ప్రస్తుతం సగానికిపైగా పనులు పూర్తయ్యాయి.
- ఖమ్మంలో బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.75 లక్షలు కేటాయించగా, పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
- ఖమ్మం జిల్లా మధిరలో బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.73 లక్షలు మంజూరు చేయగా, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

