హైదరాబాద్ : నగరంలోని అమీర్‌పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విశ్రాంత హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేట రోడ్డులోని అమ్మవారి దేవాలయం వద్ద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్రాంత హెడ్‌కానిస్టేబుల్ కనకరాజు(63) రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కనకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు.రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.