హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 2023 బ్యాచ్ సీనియర్ రెసిడెంట్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో వారికి కూడా అర్హత కల్పిస్తూ ఉత్తర్వులు జా రీ చేశారు. సెప్టెంబర్ 5తో 2023 బ్యాచ్ సీనియర్ రెసిడెంట్ల కోర్సు ముగుస్తుంది. ప్ర భుత్వం త్వరలో చేపట్టనున్న అసిస్టెంట్ ప్రొ ఫెసర్ల నియామకాల్లో తమకు కూడా అవకా శం కల్పించాలని సీనియర్ రెసిడెంట్లు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కమిటీ సిఫార్సుల మే రకు వారికి అర్హత కల్పిస్తూ ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. అయితే ఇది ఈ ఒక్కసారికి మాత్రమే అని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.
తెలంగాణలో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): నైపుణ్యం గల వారికి ఉద్యోగావకాశాలను కల్పించేందుకు తెలంగాణ ఐటీ శాఖ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసిసోసియేషన్ సహకారంతో 16న టీహబ్‌లో ఐటీ కంపెనీల మానవవనరుల విభాగం డైరెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు.
వైమానిక దళంలో అగ్నివీర్లకు ఆహ్వానం
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ల నియామకానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారత రక్షణశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 8 నుంచే https: //agnipathvayu. cdac.inలో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 28 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తామని తెలిపింది. వివరాలకు 040-27753500కు కాల్, co. 12asc-ap@gov.inకి మెయిల్ చేయాలని కోరింది.