Kolanupaka | హైదరాబాద్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): భువనగిరి జిల్లా ఆలేరు మం డలం కొలనుపాకలో అరుదైన జైన తోరణం వెలుగుచూసింది. ఇటీవల 36 మంది తో కూడిన కొత్త తెలంగాణ చరిత్ర బృం దం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆధ్వర్యంలో అక్కడ పర్యటించి, సోమేశ్వరాలయ ఆవరణలోని మ్యూజియంలో జైన తోరణాన్ని గుర్తించింది.
8, 9వ శతాబ్దాల్లో పాలించిన రాష్ట్రకూటులు దీనిని చెక్కించారని హరగోపాల్ పేర్కొన్నారు. తోరణం పైభాగంలో ధ్యానముద్రలో ముగ్గురు తీర్థంకరులు, యక్ష, యక్షిణులు, ఇరువైపులా తీగెలు, పూలు చెక్కి ఉన్నాయని తెలిపారు. ఇలాంటి తోరణమే రాజుగారి దర్వాజ (గేట్ వే ఆఫ్ కొలనుపాక) జైన దేవాలయం వెనుకవైపు ఉన్నదని పేర్కొన్నారు. వీటిని భద్రపరచాలని పురావస్తు అధికారులను కోరారు.