వాజేడు,అక్టోబర్ 16: ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం శివారు పంట పొలాల్లో గురువారం అరుదైన పక్షి కనిపించింది. శరీరం, రెక్కలు బూడిద రంగు.. కండ్లు ఎరుపు రంగుతో ఉన్న ఈ పక్షి రెండు రోజులుగా కనిపిస్తుండడంతో గ్రామస్థులు తమ సెల్ఫోన్లలో బంధించారు.
ఈ పక్షి మనిషిలాగా వింత శబ్దాలు చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై దూలపురం అటవీశాఖ రేంజ్ అధికారి బాలకృష్ణను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా ఆ పక్షిని నల్ల రెక్కల గద్ద (అడవి రామదాసు)గా పిలుస్తారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.