Bats | ఉస్మానియా యూనివర్సిటీ, మే 28: దేశం లో అరుదైన గబ్బిలం జాతి వెలుగులోకి వ చ్చింది. మినియోపెట్రస్ శ్రీని, శ్రీనిస్ బెంట్ వింగ్డ్ బ్యాట్ అనే గబ్బిలాన్ని ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎఫ్ పరిశోధకురాలు డాక్ట ర్ భార్గవి శ్రీనివాసులు, బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధక విద్యార్థి ఆదిత్య శ్రీనివాసులు కనిపెట్టారు. కర్ణాటకలోని మకుటాలో ఓ భూగర్భ గుహలో ఈ జాతిని కనుగొన్నారు.
శరీరం కంటే రెండున్నర రెట్లు ఎక్కువ పొడవైన రెక్కలను కలిగి ఉండే ఈ గబ్బిలాలు వందల సంఖ్యలో గుంపులుగా గుహల్లో నివసిస్తాయని తెలిపారు. భారత్లో ఇప్పటివరకు కనుగొన్న గబ్బిలం జాతుల సంఖ్య ఐదుకు చేరింది. ఇవి దక్షిణ, ఈశాన్య భారతావనితోపాటు నికోబార్ దీవులు, నేపాల్లోనూ కనిపిస్తాయని వెల్లడించారు. వీరి పరిశోధన పత్రాన్ని ‘పీర్ రివ్యూడ్ సైంటిఫిక్ మెగా జర్నల్’ తాజా సంచికలో ప్రచురితమైంది.