Real Estate | చౌటుప్పల్, అక్టోబర్ 1 : కాంగ్రెస్ సర్కార్ హయాంలో రియల్ వ్యాపారం ఢమాల్ అయింది. దీంతో అత్యవసరాల కోసం ఆస్తులు అమ్ముకోవాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది. దీంతో చేసేదేమీ లేక ఒకరు తన సింగిల్ రూమ్‌ను లక్కీ డ్రా వేశాడు.
చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన కే. రాంబ్రహ్మం 65వ జాతీయ రహదారికి పక్కన ఉన్న తన 66 గజాల ఇంటి స్థలాన్ని రూ. 16 లక్షలకు అమ్మకానికి పెట్టాడు. మార్కెట్ పెద్దగా లేకపోవడంతో స్థలాన్ని కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. చివరకు లక్కీ డ్రా ఏర్పాటు చేశాడు. రూ. 500కు లాటరీ టికెట్లను అమ్మకానికి పెట్టాడు. నవంబర్ 2న డ్రా తీయనున్నారు. ప్రస్తుతం ఈ డ్రా విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితి నెలకొన్న విషయం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.