హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : కోల్‌కతాలో జరిగిన దుర్ఘటన తెలంగాణలో జరుగకుండా చర్యలు చేపట్టాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని నిమ్స్ హాస్పిటల్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్డీఏ) శుక్రవారం డీజీపీ జితేందర్‌కు విన్నవించింది.
అంతకుముందు తమకు రక్షణ కల్పించాలని ప్రజావాణిలో చైర్మన్ చిన్నారెడ్డి, ఐఏఎస్ దివ్యను కలిసిన రెసిడెంట్ డాక్టర్లు అనంతరం డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్డీఏ వైస్ ప్రెసిడెంట్ సౌమ్య మాట్లాడుతూ.. వైద్యులపై జరిగే దాడులను నిలువరించి, రక్షణ కల్పించేందుకు స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్‌ను కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం ‘సెంట్రల్ ప్రొటక్షన్ యాక్ట్'(సీపీఏ)పేరిట ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు.