బుధవారం 03 జూన్ 2020
Telangana - May 02, 2020 , 10:29:45

సిద్దిపేటలో ఘోర ప్రమాదం : ఒకరు మృతి

సిద్దిపేటలో ఘోర ప్రమాదం : ఒకరు మృతి

సిద్దిపేట : దుబ్బాక మండలం తిమ్మాపూర్‌ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని మిరుదొడ్డి మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన రాజమౌళి(53)గా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమౌళి మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుమకున్నాయి. 


logo