Accident | చిలిపిచెడ్, అక్టోబర్ 15 : ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని కేతావత్ శర్మన్ నాయక్ (55)మృతి చెందారు. సంఘటన చిలిపిచెడ్ మండలం సోమక్కపేట్ శిలంపల్లి రోడ్ మార్గంలో జరిగింది. ఎస్సై నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. రహీంగూడ తండా గ్రామపంచాయతీ పరిధిలోని అంబర్య తాండకు చెందిన కేతావత్ శర్మన్ నాయక్ (55) శిలాంపల్లి నుండి తన ఇంటికి వస్తున్న మార్గమధ్యంలో రెండు బైకులు ఢీకొని శర్మన్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. సోమక్కపేట గ్రామానికి చెందిన బందేల్లి, గంగిరెద్దుల గూడెంకు చెందిన శ్రీనుకు గాయాలు కాగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.మృతున్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింలు తెలిపారు.