ములుగు : ఆరుగాలం శ్రమించిన పంట కండ్లముందే దెబ్బతినడాన్ని ఆ రైతు తట్టుకోలేకపోయాడు. తనకు చావే శరణ్యమని భావించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిర్చి(Mirchi) పంట దెబ్బతిందని ఓ రైతు(Pepper farmer) పురుగుల మందు తాగి మృతి(,Committed suicide) చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం, గుర్రేవుల గ్రామంలో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువరైతు అగ్గు మధుకర్( 26) ఎకరం చెలుకలో మిర్చి పంట వేశాడు. మిర్చి ఏరితే 3 క్వింటాలు వచ్చినట్లు బంధువులు తెలిపారు. దీంతో అప్పులు పెరు గుతాయని భావించి గ్రామం దగ్గరలోని పరేడు చెరువు దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు చెప్పారు. మధుకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.