కుంటాల, జూలై 6: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో 70 ఏండ్లకుపైగా కాలనీవాసులకు, గ్రామస్థులకు నీడనిచ్చిన ఓ వేపచెట్టు చెదలు పట్టి, ఎండిపోయి వేర్లు వదులై ఇటీవలే కూలిపోయింది. అయితే ఈ చెట్టు కింద రైతులు కాలక్షేపం చేయడం, రచ్చబండ నిర్వహించడం వంటి పనులు జరిగేవి. చెట్టు నేలకొరగడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
అయితే గ్రామానికి చెందిన గొట్టుముక్కుల కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి అదే స్థానంలో మరో వేప మొక్కను తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం నాటారు. మునుపటి సంప్రదాయం రచ్చబండ వంటివి కొనసాగేలా లక్ష రూపాయలకుపైగా వెచ్చించి చెట్టు రక్షణ కోసం గద్దెను కట్టించి గ్రామస్థుల ప్రశంసలు పొందారు.