వరంగల్ : తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై దాడి కాంగ్రెస్ గూండాలపై హత్య కేసు నమోదు చేయాలని తెలంగాణ సాంస్కృతిక సారథి రచయితల కోఆర్డినేటర్ యశ్ పాల్ కోరారు. నియోజక వర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేని గుండాలు కక్షపూరితంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మానకొండూరు నియోజకవర్గం నుంచి రసమయ బాలకృషన్ మీద రెండు దఫాలుగా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు బండ్లపల్లి సత్యనారాయణ దాడికి పాల్పడ్డాడని అన్నారు.
ఎమ్మెల్యే రసమయి ఈ మార్గంలో వస్తున్నాడని గమనించి కొంతమంది యువకులను పోగు చేసి కర్రలు, రాడ్లు, రాళ్లతో కారుపై దాడి చేశారని అన్నారు. గన్నవరం డబుల్ రోడ్డు మంజూరు చేయాలని నేపంతో జనాన్ని పోగే జాతీయ రహదారి నడిరోడ్డు మీద ధర్నాకు పిలిపినిచ్చి భౌతికంగా దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని అన్నారు.
పోలీసులు అడ్డు తగిలి రసమయిని రక్షించారని లేక పోతే తీవ్ర ఆపాయం జరిగేదని వెల్లడించారు. రసమయిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడులకు పాల్పడ్డ గూండాలను అరెస్టు చేయాలని కోరారు.