శాయంపేట, మే 28 : కోతి, కుక ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కోతుల గుం పును తప్పించుకునే క్రమంలో కిందపడి ఒకరు మృతి చెందాడు. బైక్పై వెళ్తుండగా కుక అడ్డు రావడంతో కిందపడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. ఎస్సై ప్రమోద్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన దుర్శెట్టి కుమారస్వామి (35) సోమవారం కూలి పని ముగించుకొని రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా కోతుల గుంపు ఎగబడింది.
తప్పించుకునే క్రమంలో సీసీ రోడ్డుపై పడిపోగా, తలకు తీవ్రగాయం కావడంతో అకడికకడే మృతి చెందాడు. అలాగే మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన బేతి బుచ్చిరెడ్డి (50) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15న కొప్పుల గ్రామానికి బైక్పై వెళ్తుండగా మైలారం శివారులోని పల్లె ప్రకృతి వనం వద్ద కుక అడ్డు రావడంతో బండి అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లాడు. ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు.