చార్మినార్, మే 18: హైకోర్టులో గురువారం రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం విధులు ముగిసిన అనంతరం కోర్టు సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం సంభవించడంతో కోర్టు సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది జీపీ భవనంలోని రెండో అంతస్థులో మంటలు చెలరేగినట్టు గుర్తించి అదుపు చేశారు. కొన్ని ఫైళ్లు మంటలకు ఆహుతైనట్టు తెలుస్తున్నది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇన్స్పెక్టర్ గురునాయుడుతో కలిసి చార్మినార్ ఏసీపీ రుద్రభాస్కర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.