గణపురం, ఏప్రిల్ 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(కేటీపీపీ)లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాంట్ ఆవరణలోని సోలార్ ప్రాజెక్టు కోసం కేటాయించిన స్థలంలో నిల్వ ఉంచిన రిజెక్ట్ బొగ్గు కుప్పలు అగ్నికి ఆ హుతయ్యాయి. ఎండల తీవ్రత దృష్ట్యా బొగ్గులో సెల్ఫ్ ఇగ్నిషన్ జరుగడంతో మంటలు చెలరేగి 100 ఎకరాల మేర విస్తరించాయి. దీంతో సమీప గ్రా మాల ప్రజలు, ప్లాంట్ కార్మికులు భయాందోళనకు గురయ్యారు.
అగ్నిమాపక సిబ్బంది తొ లుత మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. జిల్లా కేం ద్రం నుంచి ఐదు ఫైర్ ఇంజిన్లను తెప్పిం చి మంటలను అదుపు చేశారు. ప్లాంట్ కు నష్టం జరుగకపోవడంతో అధికారు లు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.