కారేపల్లి జనవరి 9 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల శ్రీలక్ష్మీ ప్రియ కోటెక్ జిన్నింగ్ మిల్లులో(Ginning mil) శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జిన్నింగ్ మిల్లులో నిల్వ ఉన్న పత్తి మొత్తం అగ్నికి ఆహుతి అయింది. అప్రమత్తమైన సీసీఐ సిబ్బంది, జిన్నింగ్ మిల్ యాజమాన్యం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మిల్లులో ఉన్న యంత్రాల రాపిడితో నిప్పురవ్వలు ఎగసిపడి అగ్ని ప్రమాదం జరిగిందని పలువురు భావిస్తున్నారు. ప్రమాదపు అంచనా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.