జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కర్నూల్‌కు చెందిన దేవేందర్‌కు ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన మహేశ్వరితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. గొడవల కారణంగా మహేశ్వరి తల్లి గారి దగ్గర పుట్టింట్లో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఉండవల్లిలోనే (Undavalli) అత్తగారింటికి దేవేందర్ రాగా గొడవ జరిగి హత్యకు దారితీసినట్లు తెలుస్తున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.