గద్వాల జిల్లాలో దారుణం.. పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. శెట్టిఆత్మకూరు గ్రామంలో పాతకక్షలతో ఓ వ్యక్తికి దారుణంగా హత్య చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. శెట్టిఆత్మకూరు గ్రామంలో పాతకక్షలతో ఓ వ్యక్తికి దారుణంగా హత్య చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సంధ్యా రాజు (45) కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ మహిళను అపహరించాడు. ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనికోసం సదరు మహిళ భర్తను రాజు గతంలోనే హత్య చేసి జైలుకు సైతం వెళ్లాడు. ఇటీవల జైలు నుంచి విడుదలైన రాజును దుండగులు హత్య చేశారు. పాత కక్షలతోనే రాజును హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

