హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో భారీగా మద్యం, డ్రగ్స్ పట్టుబడినట్టు తెలిపింది.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి సరిహద్దులో ఏపీ పోలీస్ శాఖ 150 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. 35 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 15 తాత్కాలిక చెక్‌పోస్ట్‌లలో 107.96కోట్ల నగదును సీజ్‌చేసి, 7305 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొంది.