హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు శనివారం మధ్యాహ్నం భారీగా విదేశి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసిన అధికారులు వారి వద్ద నుంచి రూ. 9.5 కోట్ల విలువైన 27 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని ( Hydroponic cannabis) స్వాధీనం చేసుకున్నారు.
ట్రాలీ బ్యాగుల్లో ఉంచి తరలిస్తుండగా పట్టుకున్నారు. నలుగురు విదేశాల నుంచి వచ్చిన నలుగురితో పాటు గంజాయిని తీసుకు వెళ్లేందుకు వచ్చిన మరో ముగ్గురిని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.