నీలగిరి, జూన్ 13 : నల్లగొండ రైల్వే స్టేషన్లో గురువారం పెద్దఎత్తున నగదు దొరికింది. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో భా రీగా నగదును తరలిస్తున్న బంగారం వ్యాపారిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మిర్యాలగూడకు చెందిన బంగారం వ్యాపారి సోమ ప్రవీణ్ రెండు బ్యాగుల నిండా నగదును తీ సుకెళ్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేశారు.
రూ.1.28 కోట్లు తరలిస్తుండటం, నగదుకు సంబంధించిన రసీదులు, ఆధారాలు చూపకపోవడంతో డబ్బును సీజ్ చేసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నగదు హైదరాబాద్‌లోని బంగా రు దుకాణంలో చెల్లించేందుకు తీసుకెళ్తున్నట్టు సదరు వ్యక్తి పేర్కొన్నట్టు సీఐ సురేందర్‌గౌడ్ తెలిపారు.