KGBV | జోగులాంబ గద్వాల : ఉండవెల్లి మండలంలోని కలగొట్ల గ్రామంలోని కేజీబీవీ పాఠశాల విద్యార్థిని పాముకాటుకు గురైన ఘటన బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దాక్షాయిని అనే విద్యార్థిని ఉదయం పాఠశాల ఆవరణలో పాముకాటుకు గురైంది. ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు తెలపడంతో విషయాన్ని ఉపాధ్యాయులకు చేరవేశారు. దీంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థిని తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై పాఠశాల ఎస్ఓ పరిమళను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.